నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సి. ఎం. కప్ గ్రామ పంచాయతీ పోటీలను గురువారం సర్పంచ్ ఎంబరీ గౌతమి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఒలింపిక్ స్థాయి వరకు క్రీడల్లో ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కప్ క్రీడలను ప్రారంభించారని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినయ్,ప్రధానోపాధ్యాయులు కిరణ్,గ్రామ కార్యదర్శి శేఖర్,గ్రామ పెద్దలు వెంకటేష్, పి. డి. కృష్ణప్రసాద్,సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.





