Wednesday, March 11, 2026

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : తహశీల్దార్ శ్రీనివాస్

నేటిసాక్షి, మిర్యాలగూడ :విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని మిర్యాలగూడ మాండల తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని శాస్త్ర హై స్కూల్ లో స్పోర్ట్స్ హాబ్ కార్యక్రమాన్ని చైర్మన్ మైనం చంద్రశేఖర్, కరస్పాండెంట్ పాశం శ్రీధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిర్యాలగూడ మండల తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదవుతో పాటు అన్ని రంగాలలో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి ఉన్నత పదవులను పొంది, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర హై స్కూల్ ప్రిన్సిపాల్ సింధు రెడ్డి, టీచర్స్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News