నేటి సాక్షి.. చిలుకూరు చిలుకూరు మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ రాజ మహమ్మద్ హెచ్చరించారు గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు రోడ్డు దాటేటప్పుడు విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చూపించారు అనంతరం భద్రత వారోత్సవాలు ప్రతిష్టను విద్యార్థులతో చేయించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…





