నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో గాండీవం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలండర్ ను ఎస్పీ అశోక్ కుమార్ గురువారంఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వార్తాపత్రికలు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని, ఒక్క పత్రిక పదివేల సైన్యంతో సమానం అని పెద్దలు భావించేవారని ఎస్పీ అన్నారు.ప్రజలలో సామాజిక చైతన్యం, విజ్ఞానం పెంపొందించడంలో గాండీవం దినపత్రిక ముందుంటుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలోను సామాజిక బాధ్యతను గుర్తు చేయడంలో, నేటికీ పత్రికలు సమాజ నిర్మాణంలో ఒక మూలస్తంభంగా నిలుస్తున్నాయనీ, ప్రభుత్వ విధానాలను ప్రజలకు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో దినపత్రిక ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండీవం దినపత్రిక జగిత్యాల జిల్లా ప్రతినిధి నక్క సతీష్, జగిత్యాల రిపోర్టర్, బాపురపు వెంకటేష్,కోరుట్ల నియోజకవర్గం ఆర్సి రాజేందర్, దుమల గంగాధర్, సిర్ర లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.





