నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులు కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ రష్మీ పెరుమాళ్., ఐపీఎస్ మాట్లాడుతుసిద్దిపేట జిల్లా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను సందర్శించిన మొదటి గ్రామం ఇదేనని, అందుకే పెద్దమాసన్‌పల్లి గ్రామస్తులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోనే ఒక ‘ఆదర్శ గ్రామంగా’ నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది కేవలం పోలీసుల కోసం కాదని, మీ కుటుంబ భద్రత కోసమని సూచించారు. గ్రామస్తులతో నేరుగా ముచ్చటించి, రహదారి భద్రతపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సామాజిక బాధ్యతగా 100 హెల్మెట్లను విరాళంగా ఇచ్చిన సర్పంచ్ పన్యాల ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.హెల్మెట్ల పంపిణీ అనంతరం, హెల్మెట్లు ధరించిన వాహనదారులతో నిర్వహించిన బైక్ ర్యాలీని కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. “హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ఇంటికి చేరండి” అనే నినాదంతో ఈ ర్యాలీ సాగింది.కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ లతీఫ్, ఎస్సై రవికాంత్, గ్రామ ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.





