Wednesday, March 11, 2026

రాయికల్ ను అభివృద్ధి చేసిన ఘనత కే సీ ఆర్ దే- బి ఆర్ ఎస్ అధ్యక్షురాలు దావ వసంత సురేష్ రాయికల్ –

నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే అని బి ఆర్ ఎస్ అధ్యక్షురాలు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చేర్ పర్సన్ దావ వసంత సురేష్ అని అన్నారు. రాయికల్ పట్టణంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయికల్ పట్టణంలో జరిగిన ప్రతి పని కేసీఆర్ ఉన్నపుడు జరిగిన అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి లేదు అని అన్నారు.రాయికల్ ను మున్సిపల్ గా చేసి మొదటిసారి రాయికల్ మున్సిపల్ లో గులాబీ జెండా ఎగరవేశామని, పార్టీ చేసిన అభివృద్ధితో మళ్ళీ రాయికల్ పట్టణంలో గులాబీ జెండా ఎగరేవేస్తామని అన్నారు. పట్టణంలో బిఆర్ఎస్ హయాంలో నిరు పేదలకు 60 డబల్ బెడ్ రూమ్ లు కేసీఆర్ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే రాయికల్ నుండి మైతాపూర్ బ్రిడ్జి మరియు ఇటిక్యాల్ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని ప్రశ్నించారు. కార్యకర్తల కష్టం మీద గెలిచిన నువ్వు సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావు అని అన్నారు.పొలాలు నాటు వేసే సమయం కూడా అయిపోయిందని ఇంకా రైతు భరోసా కింద డబ్బులు ఎందుకు జమ కాలేదని అని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 18 సంవత్సరాలు నిండా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్నారు ఎప్పుడు ఇస్తారు..2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కింద చెరువుల పూడిక తీసి చెరువులో చాప పిల్లలు వేసి గంగపుత్రుల జీవితాల్లో వెలుగు నింపిన ఘనత కేసిఆర్ అని అన్నారు. రాయికల్ పట్టణంలో అనువణువులో కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. రాయికల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి కూడా ఓట్లు అడిగి అర్హత లేదని అన్నారు. ప్రభుత్వంతో కలిసి పని చేస్తా అన్న ఎమ్మెల్యే గాంధీ భవన్ కి ఎందుకు వెళ్లావు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని మీకు గాంధీభవన్లో ఏం పని అన్నారు.ఎలక్షన్ టైం లో ప్రజల దృష్టి మళ్లించేందుకు బి ఆర్ ఎస్ నాయకులకు కక్షపూరితంగా నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వాసం రాజేందర్, కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయశ్రీ లింగన్న ,మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, మాజీ కౌన్సిలర్ లు శ్రీరాములు సత్య నారాయణ,మహేష్ గౌడ్, మహేందర్ మాజీ కో ఆప్షన్ వనిత, గణేష్, సోహెల్ నాయకులు బాబా,ప్రశాంత్ రావు, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News