నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు, సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, సాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ రంగ సమస్యలతో పాటు ముఖ్యంగా గుండి, లక్మాపూర్ బ్రిడ్జిల నిర్మాణాలపై ఉప ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం అందజేసి, త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు జాబరి రవీందర్ గారు తదితరులు పాల్గొన్నారు.





