నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 23, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో కూలీల ఆటోలో ఎక్కి వస్తుండగా బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందినారు. ధన్వాడ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండల కేంద్రం నుండి కూలి పని కోసం శుక్రవారం నాడు ఆటోలో 25 మందిపైగా ఆటోలో ఎక్కి మరికల్ మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామానికి కూలి పని కోసం వస్తుండగా దన్వాడలోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలో పంది అడ్డం రావడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు వివరించారు. మృతి చెందిన ఇద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు వివరించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు తీవ్ర గాయాలైన మరో ఐదుగురిని నారాయణపేట జిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ధన్వాడ పోలీసులు తెలిపారు.





