నేటిసాక్షి, కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తామని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా కరీంనగర్లో శుక్రవారం మంచిర్యాల చౌరస్తా నుంచి సుభాష్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అవకాశవాద పార్టీలను ఓడించాలని, అన్ని మున్సిపాలిటీల్లో పోటీచేసి సింహం గుర్తు జెండాలను ఎగురవేస్తామన్నారు. నాయకులు కురువెల్లి శంకర్, బొంకూరి సురేందర్, ప్రశాంత్‌కుమార్, అతికం రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





