Wednesday, March 11, 2026

*ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస మహోత్సవం*

*నేటి సాక్షి -మేడిపల్లి* భీమారం మండలం మన్నే గూడెం గ్రామంలో వసంత పంచమి పురస్కరించుకొని పాఠశాల యందు గల శ్రీ సరస్వతీ మాత కు పాఠశాల యాజమాన్యం పురుహితులతో సరస్వతి మాత కి పూజా కార్యక్రమాలు నిర్వహించి నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, దాసరి పరంధామ్, పాల్గొని ఈరోజు వసంత పంచమి రోజున సరస్వతి మాత పుట్టినరోజు కాబట్టి ఈరోజు మనందరం కూడా సరస్వతి తల్లికి పూజలు నిర్వహించారు అలాగే పిల్లలకు మాత అనుగ్రహం కలిగి ఉండాలని పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్లాలని వారికి, ఆయురారోగ్యాలు కలగ చేయాలని కోరుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాఠశాల యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News