నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారిని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రానున్న మున్సిపాలిటీ ఎన్నికలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక అంశాలను పంచుకున్నారు.





