నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులు ఎల్లారెడ్డిపేట ,గోవర్ధనగిరి గ్రామాలలో డీఏవో స్వరూపా రాణి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ప్రభుత్వ పథకాలు పొందడానికి వీలుగా తమ భూమి వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారి మోహన్ ఏఈఓలు దేవేందర్ ,నాగార్జున ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అయినటువంటి *పి ఎం కిసాన్(2000) డబ్బులు, సబ్సిడీ పై ఇస్తున్న ఎరువుల బస్తాలు,పంట దిగుబడి కొనుగోళ్లకు మద్దతు ధర మరియు పంట రుణాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబరు తప్పనిసరి కావున ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని సూచించారు .ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతి రైతుకి ఆధార్ నంబర్ వలె ప్రత్యేక రైతు గుర్తింపు నంబర్ ఇవ్వబడును.





