నేటి సాక్షి,తెలంగాణం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ కోటపల్లి ఎస్ ఐ రాజశేఖర్ చేతుల మీదుగా క్యాలెండరన్ ఆవిష్కరించారు. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రచురిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న తెలంగాణం యాజమాన్యాన్ని, జర్నలిస్టులను అభినందించారు. ఎస్ ఐ రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణం దిన పత్రిక సమాజంలో ఒక శక్తి వంతమైన సమాచార మాధ్యమంగా పని చేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చెరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషి స్తుందన్నారు. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం గా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో నేటి సాక్షి రిపోర్టార్ రవీందర్ పాల్గొన్నారు





