Wednesday, March 11, 2026

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 23 మండల కేంద్రమైన చౌడేపల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వీటన్నిటితో పాటు విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ నారా లోకేష్ యువతకు కార్యకర్తలకు అండగా ప్రజల అభివృద్ధికి దిక్సూచి లాంటి నాయకుడు అన్నారు, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు, కార్యకర్తలకు ధైర్యంగా అండగా నిలిచే నాయకుడిగా ప్రజల్లో విశేష గుర్తింపు సంపాదిస్తున్నారన్నారు. నారా లోకేష్ ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రజలకు మరింత సేవా చేయాలని మనస్పూర్తిగా కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆవుల రామచంద్రయ్య .పూల చంద్రమౌళి. పవన్ కుమార్ .గిరిరాజు. జంపాల శ్రీనివాసులు .బోయకొండ సుబ్బు. సోము .చంగల్రాయప్ప. గని .ముని .వెంకటప్ప .నాగరాజు రెడ్డి. అర్జున్ రాయల్. అమిద్ ప్రజానిపల్లి బాబు నాయుడు చారాల విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News