** నేటి సాక్షి చిలుకూరుచిలుకూరు: చిలుకూరు గ్రామంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మండలంలోని నారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల జీహెచ్ఎమ్ గుజ్జుల నరసింహారెడ్డి తల్లి రోశమ్మ(82) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినారు. ఆమే మృతి పట్ల గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఎంఈవో గురవయ్య, జీహెచ్ఎమ్లు, ఉపాధ్యాయులు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, టీడీపీ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.





