Wednesday, March 11, 2026

*రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపిక*

నేటి సాక్షి, ధర్మారం (జనవరి 23) : పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట స్థాయి తెలంగాణ ఇంగ్లీష్ ఒలింపియాడ్ కి ఎంపికయ్యారని శుక్రవారం ఈరవేణి ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం ఈ నెల 09 న పెద్దపల్లి లో నిర్వహించిన జిల్లా స్థాయి తెలంగాణ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (టీఈవో) ఇంగ్లీష్ వ్యాస రచనం, ఉపన్యాస పోటీలలో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు జీ. సహస్ర, ఓ సంజన జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని, వీరు ఈ నెల 24 న అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో జరుగు రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్, ఆంగ్ల ఉపాధ్యాయులు శివరంజని, రాజశేఖర్, రత్నాకర్ తదితరులు విద్యార్థులను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News