*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలోని కొత్తపేట హనుమాన్ ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేసి మాట్లాడుతూ.. జ్ఞానాన్ని పెంపొందించే రోజుగా పరిగణింపబడే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం జరపడం గొప్ప విశేషమని, ఆలయ అర్చకుడితో శాస్త్రీయంగా వేద మంత్రోత్సవాల నడుమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆండాలు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు రమాదేవి, స్వప్న, నవనీత, పంచాయతీ కార్యదర్శి గోమతి, ఉప సర్పంచ్ క్రాంతి, పాలకవర్గ సభ్యులు గంగారెడ్డి, రవి, సంతోష్, యాదగిరి, రాయమల్లు, శ్యామల, స్వప్న, అర్చన, గంగమ్మ, మాజీ సర్పంచ్ బొమ్మరవేణి రాజేష్, గోపాలరావు, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





