Wednesday, March 11, 2026

“శ్రీ సరస్వతీ శిశు మందిర్” లో సామూహిక అక్షరాభ్యాసాలు-53 మంది చిన్నారుల చేత అక్షరాభ్యాసాలు-బాసర శ్రీ సరస్వతి అమ్మవారి కుంకుమతో పూజలు-శ్రీ సరస్వతీ శిశు మందిర్” ఎంతో మంది విద్యార్థులను ఉన్నత కొలువులో నిలిపింది : మురహరి, దయాకర్

నేటిసాక్షి, మిర్యాలగూడ : వసంత పంచమిని పురస్కరించుకొని పట్టణంలోని ‘శ్రీ సరస్వతీ శిశు మందిర్’ లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది చిన్నారులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాసాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల సమితి, కమిటీ అధ్యక్షులు ఏచూరి మురహరి, గౌర్ దయాకర్ లు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. బాసరలోని సరస్వతి అమ్మవారి చేత పూజలు చేయించిన కుంకుమతోపాటు, ఆమ్మవారి ప్రతిమలను అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తమ పాఠశాలలో 1974 లో పీఠాధిపతుల చేత 1స్థాపితమైన సరస్వతి అమ్మవారి సన్నిధానంలో, అత్యంత సాంప్రదాయబద్ధంగా వేద పండితుల చేత ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమాల ద్వారా వేలాదిమంది చిన్నారులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది పాఠశాలలో కొలువైన అమ్మవారికి దేవాలయ నిర్మాణం చేపట్టి, మరింతగా అభివృద్ధి పథంలోకి పాఠశాలను తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు గూడూరు శ్రీనివాసరావు, నందికొండ చంద్రయ్య, రామ్ కుమార్, ఏచూరి భాగ్యలక్ష్మి తో పాటు పాఠశాల ప్రధానాచార్యులు చెన్నూరు రవికుమార్, మాతాజీలు గాదె స్వాతి, తుపాకుల నాగమణి, బేతంశే ట్టి మానస, నడ్డి రేణుక, జయశ్రీ,, పందిరి శ్రావణి, ఆవుల నాగలక్ష్మి, గుంజ పార్వతి, సత్యవతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News