Wednesday, March 11, 2026

రాయికల్ రేంజ్ లో కొనసాగుతున్న జంతు గణన

నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే శాకాహార,మాంసాహార అడవి జంతువుల గణన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ 2026 లో భాగంగా జనవరి 20 నుండి 25 వరకు జంతు గణన చేస్తున్నట్లు ఎఫ్ ఆర్ ఓ భూమేష్ ప్రకటనలో తెలిపారు.శాకాహార జంతు గణన 20 నుండి 22 వ తేదీ వరకు మాంసాహార జంతు గణన 23 నుండి 25 వరకు ప్రతిరోజు 5 కిమీ. ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకి రెండు సార్లు జంతువు యొక్క పాదముద్రలు చెట్లకు వాటియొక్క గోర్ల గుర్తుల ఆదారంగా లెక్కిస్తారని తెలిపారు.జంతువుల పాదముద్రలు,మలం,చెట్లకు గీరిన గుర్తుల ఆధారంగా లెక్కింపు చేసి చెట్లు,గడ్డి జాతులు,ఔషద మొక్కల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రాయికల్ రేంజ్ లోని 15 బిట్స్ లలో చింతలూరు సెక్షన్ పరిధిలోని 3 బీట్స్ లలో రేంజ్ ఆఫీసర్ భూమేష్,సెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్,బీట్ ఆఫీసర్ రత్నాకర్, చంద్రశేఖర్,బేస్ క్యాంప్ సిబ్బంది సుంగు,మల్లేశం,లక్ష్మణ్ మరియు వాలంటీర్ రమేష్ ఆధ్వర్యంలో జంతు గణన జరుగుతుందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News