నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంలో 7 కోట్ల 20 లక్షల నిధుల అభివృద్ధి పనులకు శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మరియు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్ట్,బస్సు లు,వ్యాపారాలు,క్యాంటీన్,ప్రభుత్వ ఏక రూప దుస్తులు,ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని..ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ చేశామని.నూతన రేషన్ కార్డులు పంపిణీ తో సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.ఆహార భద్రత లో భాగంగా సన్న బియ్యం అందజేసిన ఘనత 200 యూనిట్ల ఉచిత కరెంట్..ఉచిత బస్సు సబ్సిడీ సిలిండర్ ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా విడత వారిగా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక స కాలంలో రైతు రుణ మాఫీ సన్న వడ్లకి బోనస్ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు..ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా చొరవ తీసుకుంటానని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మొదటి తారీకు జీతాలు చెల్లిస్తున్నామనిప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేటి ప్రభుత్వం పై పెద్ద పిడుగులా ప్రతి నెల వందల కోట్ల వడ్డీ చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే వినతి మేరకు రాయికల్ లో అన్ని కుల సంఘాల అభివృద్ధి కి,స్మశాక వాటిక,చర్చి,మజీద్ ల అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేస్తా అన్నారు.. *ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ*రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో రాయికల్ పట్టణం లో గతంలో పని చేసిన కాంట్రాక్టర్లకు 3 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్ లకు చెల్లింపు చేయడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం లో 3 కోట్ల90లక్షల పనులు రాయికల్ పట్టణం లో చేయటం జరిగిందని.. 82 లక్షలతో నూతన పనులకు అనుమతులు రావడం జరిగిందని అన్నారు.నగరాభివృద్ధి స్కీమ్ లో 15 కోట్ల తో రాయికల్ పట్టణ అభివృద్ధి కి ముఖ్యమంత్రి నిధులు మంజూరు అయ్యాయి.7.20 కోట్ల లో 1 కోటి తో మున్సిపల్ పార్కు అభివృద్ధి చేస్తున్నామన్నారు.20 లక్షల తో డివైడర్ పనులు, 3.15 కోట్ల CC రోడ్లు డ్రైనేజీ లు పనులుపట్టణం లో జంక్షన్ ల అభివృద్ధి కి 1 కోటి కేటాయింపు చేయటం జరిగిందని తెలిపారు.5 కోట్ల నిధులు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ కి 4 చోట్ల పెద్ద డ్రైనేజీలకి కేటాయింపు చేయటం జరిగిందని .15 కోట్ల తో రాయికల్ మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు.స్మశాన వాటిక అభి వృద్ధి కోసం 50 లక్షలు ,1 కోటి రూపాయలు రాయికల్ రామాజీ పెట్ వీధి దీపాలు కు కేటాయించడం జరిగింది.260కోట్ల తో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 450పడకల ఆసుపత్రి మనకు రానుందని అన్నారుమహిళా సంఘాల కు 11 లక్షల వడ్డీ లేని రుణాలు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది అని అన్నారు.రాయికల్ పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా..రాయికల్ పట్టణంలో ఎటు చూసినా అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయి అని అన్నారు.పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కి మంత్రి గారితో మాట్లాడడం జరిగింది రెండు రోజులో చేప పిల్లలు పంపిణీ ఉంటుంది అని అన్నారు.రాయికల్ మున్సిపల్ అభివ్రుద్ది కి ప్రభుత్వ పక్షాన ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డివో మధుసూదన్, కమిషనర్ నాగరాజు, ఎమ్మార్వో నాగార్జున,ఎంపీడీవో చిరంజీవి,మెప్మ ఏ ఓ శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, అచ్యుత రావు మాజీ పాక్స్ చైర్మన్, ఏనుగు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రావు, రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





