Wednesday, March 11, 2026

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

నేటి సాక్షి, రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంలో విలేఖరులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మరియు అట్టి స్థలంలో ఇండ్లు మంజూరు చేయాలని, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కు స్థలం కేటాయించాలని కోరుతూ శనివారం రాయికల్ ప్రెస్ క్లబ్ (జె ఎ సి)సభ్యులు కార్యవర్గం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. రాయికల్ పట్టణం లోని డబుల్ బెడ్ రూమ్ దగ్గర రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది.అట్టి భూమిలో అనేక సంవత్సరాల నుండి జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం కోరుతున్నప్పటికీ ఎవరు స్పందించలేదని. అనేక మంది జర్నలిస్టులు స్వంత ఇల్లు లేక అద్దె ఇండ్ల లో కాలం వెల్లదీస్తున్నారని తమరు స్పందించి ఖాళీగా ఉన్న అట్టి స్థలాన్ని కేటాయించ గలరని మరియు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కొరకు తహసిల్దార్ కార్యాలయం రోడ్ లో ఉన్న బస్టాండ్ వద్ద ఖాళీగా ఉన్న స్థలాన్ని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతకుంట సాయికుమార్,ప్రధాన కార్యదర్శి సింగిడి శంకరయ్య,కోశాధికారి కడకుంట్లజగదీశ్వర్ ,ఉపాధ్యక్షులు సింగని శ్యామ్ సుందర్ యాచమనేని కిరణ్ బాబు సహా కార్యదర్శి తిరుమల శంకర్ గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్ మాజీ అధ్యక్షులు వాసరి రవి,మాజీ కోశాధికారి మచ్చ శేఖర్ సభ్యులు అందె రంజిత్ తీగుల్ల గోపి ,గన్నవరం గంగాధర్ ఓరగంటి భీమ్ రాజ్ అనుపురంలింబద్రి ఎండి ఇర్ఫాన్ గట్టుపల్లి నరేష్ ,గంట్యాల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News