Wednesday, March 11, 2026

*కులమతాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం** 22వ వార్డులో ప్రజల పరామర్శ—-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో శనివారం డాక్టర్ స్వీతి అనూప్ రావు, అల్లడి ప్రవీణ్ కుమార్, మాడవేణి స్వప్న నరేష్‌లు పర్యటించి పలువురు స్థానికులను పరామర్శించారు. వార్డు ప్రజల క్షేమాన్ని అడిగి తెలుసుకుంటూ, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు బూత్ కార్యకర్తలు, మహిళా మోర్చా మహిళలు, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని నేతలకు మద్దతుగా నిలిచారు.*అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి*ఈ సందర్భంగా డాక్టర్ స్వీతి అనూప్ రావు, అల్లడి ప్రవీణ్ కుమార్‌లు మాట్లాడుతూ 22వ వార్డు కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూతం భీమయ్య, మచ్చ శ్రీధర్, బొమ్మన విజయ్, గోనెల రాజశేఖర్, మాడవేణి సురేష్‌లు పాల్గొన్నారు. మహిళా కార్యకర్తలు గాలి విజయ, గాలి లత, ముత్యాల లత, గడ్డం సంధ్య, బండారి లావణ్యతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.——–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News