– కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వైభవోపేత కార్యక్రమం
నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, పద్మశాలి ఆడబిడ్డ అయిన పద్మావతి అమ్మవారికి సోమవారం ఘనంగా పుట్టింటి సారెను సమర్పించారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు గారి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి కులబాంధవులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులు ధరించి, శోభాయాత్రగా తరలివచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, మంగళప్రదమైన సారెను భక్తిశ్రద్ధలతో అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ “తిరుచానూర్ (తిరుపతి)లో పద్మావతి అమ్మవారికి అధికారికంగా సారె సమర్పించే ఆనవాయితీని స్ఫూర్తిగా తీసుకుని, కరీంనగర్లో కూడా ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. వేంకటేశ్వర స్వామి వారి కల్యాణానికి ముందు రోజు అమ్మవారికి పుట్టింటి కానుకలు సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం” అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్, పోపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, దేవసాని పాపన్న, మోర రాజేశం, అల్స భద్రన్న, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమల్ల శ్రీకాంత్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, కోశాధికారి గజవెల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు తెల్ల చంద్రశేఖర్, ఎలిగేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు వడ్డేపల్లి జ్యోతి, ఉషకోయిల సుజాత, బొల్లి రవి, పొరండ్ల రమేష్, నల్ల శ్రీధర్, మాసం సుధాకర్, బొల్లబత్తిని రవీందర్ మరియు పెద్ద సంఖ్యలో కులబాంధవులు పాల్గొన్నారు.





