నేటి సాక్షి – మెట్ పల్లి(దామ రాజేష్) 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి పట్టణం లో సుజిత్ రావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఈ సందర్భంగా సుజిత్ రావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణం రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సుజిత్ రావు ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర సేవాదళ్ సెక్రెటరీ అందె మారుతీ, కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఖుతుబ్భుదిన్ పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి దొడ్డిపట్ల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ అమ్ముల పవన్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.





