నేటి సాక్షి 28జనవరి నందికొట్కూరు:– నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివనందరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య గారి ఆదేశాలమేరకు నిన్న మంగళగిరి టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో పార్లమెంట్ కమిటీ వర్కుషాప్ లో పాల్గొన్న నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేయింగ్ సెక్రటరీ [ఎస్ ఎండీ జమీల్] పాల్గొన్నారు ఎస్ ఎండీ జమీల్ మాట్లాడుతూ, “పార్టీ అగ్రనాయకత్వం అందించిన సూచనలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. క్రమశిక్షణతో కూడిన పనితీరుతో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథంలోకి తీసుకురావడానికి మేమంతా సైనికుల్లా పనిచేస్తాం. ఈ వర్క్ షాప్ మాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది,” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.





