నేటిసాక్షి. కొడిమ్యాలసోమవారం. 02జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు రోజున సీఎం కప్ 2025-26 మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇ. స్వరూప స్థానిక కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారులు పల్లె నుండి ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు సీఎం కప్పు ప్రభుత్వం నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు. మండల స్థాయిలో నిర్వహించే క్రీడల్లో గెలుపొందిన విజేతలు జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వాలీబాల్ కబడ్డీ కోకో క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈ స్వరూప. సర్పంచ్ జీవన్ రెడ్డి, ఎఎంసి మల్యాల వైస్ చైర్మన్ కొండూరు రాజేష్ , ఉపసర్పంచ్ గుర్రం నరసయ్య గౌడ్, వార్డు మెంబర్లు శ్రీజ, శ్రీనివాస్, మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్, మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి బూట్ల రాజామల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర , ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య ,శివకృష్ణ, అనూప్ రెడ్డి, మల్లయ్య, హబీబ్ , ప్రదీప్ లు పాల్గొన్నారు. వాలీబాల్: 18 ఏళ్ల లోపు బాలబాలికలకు. కో-కో: 14 నుండి 20 ఏళ్ల లోపు బాలబాలికలకు. కబడ్డీ: పురుషులు. మహిళలకు.అథ్లెటిక్స్: వివిధ విభాగాల్లో పరుగు పందాలలో. హిమాత్రావు పేట. నాచుపెల్లి. పూడూర్. రామకృష్ణాపూర్. కొడిమ్యాల. సూరంపేట. చెప్యాలా. తిరుమలాపూర్. నమిలకొండ. క్లస్టర్ల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.





