నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 04 మంత్రాలయం మండలంలోని సౌలహళ్లి గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో దళితులకు న్యాయం చేయాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1995లో ప్రభుత్వం సర్వే నంబర్ 19/బి1ఏలోని సుమారు 2.89 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 50 మంది నిరుపేద దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. అయితే, ఆ భూమిపై హక్కులు తమవేనంటూ పూర్వ భూయజమాని కోర్టును ఆశ్రయించడంతో వివాదం నెలకొన్నట్లు పేర్కొన్నారు.దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను త్వరితగతిన పరిష్కరించి దళితులకు న్యాయం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





