నేటి సాక్షి 02 ఫిబ్రవరి పాములపాడు :-పాములపాడు నుండి చెలిమిల్ల కు తారు రోడ్డు లేక మెటల్ రోడ్డు మాత్రమే ఉన్నది.చెలిమిల్ల గ్రామస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెలిమిళ్ళ నుండి సుమారు 30 గ్రామాలు ఉన్నాయి. పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలు తిరగడం వలన పాడైపోయిన గ్రామీణ ప్రాంతాల రోడ్లను చెలిమిళ్ళ రోడ్డు లను వెంటనే బాగు చేయాలి.చెలిమిళ్ళ గ్రామంలో ప్రజలకు అత్యవసర లో ఏది ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ గర్భిణీ స్త్రీలకు డెలివరీ లకు గానీ ఏ ఇతరత్రా అత్యవసర పనులకు వెళ్లిన రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి.కాబట్టి అధికారులు కొత్త రోడ్డు వేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు . నంద్యాల జిల్లా పాములపాడు మండలం చెలిమిల్ల రస్తాను పరిశీలిస్తూ ఆయన మాట్లాడుతూ దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నేషనల్ హైవే రోడ్డుకు మట్టి బిలుకు తోలడానికి ఆర్టీవో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చినందుకు పాములపాడు నుండి చెలిమిళ్ళ వరకు అలాగే కృష్ణరావుపేట నుండి ఆనందపురం వరకు రోడ్డు చింద్రభద్రమైందని నేషనల్ హైవేకు హైవేకు మట్టి తోలుకున్న పిఎస్కే కంపెనీ వారు కూడా రోడ్డు వెయ్యాలనే ఆలోచన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చెలిమీల్ల పాములపాడు కృష్ణరావుపేట ఆనందపురం సిద్దేశ్వరం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు అన్నారు. రోడ్లు పాడైపోవడానికి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారుల లేదా మట్టి తోలుకొని నేషనల్ హైవే రోడ్డు వేసిన పి ఎస్ కే కంపెనీ వారు వేస్తారో వాళ్ళే తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు.భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారులపై నేషనల్ హైవే రోడ్డు పూర్తిచేసుకుని గ్రామీణ రోడ్లను పాడుచేసిన పి ఎస్ కే కంపెనీపై లోకయుక్త మానవ హక్కుల కమిషన్కు తీసుకెళ్తారని ఆయన హెచ్చరించారు.





