*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )విద్యార్థులు విద్యలో చూపించే దినదిన అభివృద్ధి వారు ఎంచుకున్న లక్ష్యాలకు చేర్చడానికి దోహదపడుతోందని వ్యక్తిత్వ వికాసాన్నిపుణులు కెప్టెన్ డాక్టర్ లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు. విద్యార్థులు చెడు అలవాట్లను త్వరగా గ్రహిస్తారని వాటికి దూరంగా ఉండి వారు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రతినిత్యం కష్టపడాలన్నారు. రోజులోని 24 గంటల్లో పాఠశాలకు ఎనిమిది గంటలు నిద్రకు ఎనిమిది గంటలు పోగా మిగిలిన ఎనిమిది గంటల్లో ఎక్కువ సమయాన్ని విద్య కోసం కేటాయిస్తారో వారే ఉన్నత లక్ష్యాలను చేరుకొని ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థి తనను తాను తెలుసుకొని తనలోని చెడు లక్షణాలైనా అలసత్వం, సోమరితనాన్ని దూరం చేసుకుని తనను తాను జయించినప్పుడే విజయాలు తనకు దాసోహమైతాయన్నారు. ఇప్పుడు టెన్త్ చదువుతున్న మీరు మరో ఆరు సంవత్సరాలలో మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ విద్యార్థుల్లో పోబియో ఉంటుందని పరీక్షలు అంటే భయం లేకుండా చదివిందాన్ని పరీక్షల్లో రాయాలన్నారు. ఉన్నత చదువులకు 10వ తరగతి ఒక మెట్టు మాత్రమే అని పదవ తరగతి మార్కులతో సాధించేది ఏమీ లేదని విద్యార్థులు పాఠాలను బట్టి పట్టకుండా ప్రాక్టీస్ ద్వారా విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూరి శ్రీనివాస్, జి ఎల్ టి కోఆర్డినేటర్ లయన్ ఇనుగుర్తి రమేష్, లయన్ అంజనా రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుంకరి రవి గొల్లపల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముస్కు కరుణాకర్ రెడ్డి కార్యదర్శి సాయిని నరహరి సభ్యుడు తాడూరి సత్యనారాయణ,తాడూరి శ్రీనివాస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు





