Sunday, March 8, 2026

పూర్తి అంగవైకల్యం గల వికలాంగులకు. 15 వేలు పింఛన్ ఇవ్వాలి …. బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ – వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి :– రాయపాటి మురళి మోహన్ బిజెపి మండల అధ్యక్షుడు….

నేటి సాక్షి 02ఫిబ్రవరి పాములపాడు :–పాములపాడు మండలంలో పూర్తి అంగవైకల్యం గల వికలాంగులకు రూ. 15వేలు పింఛన్ ఇవ్వాలని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు, జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు సూచనలతో పాములపాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా సోమవారం వికలాంగుల సమస్యలపై తహసిల్దార్ కు వినతి పత్రాలు అందజేయడం జరిగిందనీ తెలిపారు. తుమ్మలూరు గ్రామానికి చెందిన వికలాంగులు భాస్కర్ రెడ్డి, చాంద్ బాషా మాట్లాడుతూ మాకు 90 శాతం పూర్తి అంగవైకల్యం ఉందని వికలాంగుల పింఛన్ రూ.6వెల నుంచి 15 వేల వరకు పెంచాలని, అలాగే నిత్యవసర సరుకులు వికలాంగుల ఇంటికి పంపవలసిన రేషన్ డీలర్ మాకు పంపడం లేదని, నూతన ట్రైసైకిల్, గృహం మంజూరు చేయాలని కోరారు. టిటిసి చదివిన చాంద్ భాషా కు స్వయం ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల వైస్ ప్రెసిడెంట్ లింగాల గోపాలకృష్ణయ్య, చిన్న మద్దిలేటి, సంజన, రామకృష్ణ, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News