*నేటి సాక్షి,గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలో యూరియా కొరత తీర్చాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం గన్నేరువరం మండలం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ మండలం లో రైతులకు సరిపడే యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారని ఆన్ లైన్ లో యూరియా బుకింగ్ చేసుకోవాలని అధికారులు చెప్పుతున్నారని కానీ చాలామంది రైతులకు చదువు రాక అవస్థలుపడుతున్నారు అని వారు ఎలా బుకింగ్ చేస్తారు అని అన్నారు .ప్రతి గ్రామంలో యూరియా కొరత ఉందని యూరియా ఎప్పుడు వస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారని అని అన్నారు. ప్రతి గ్రామం లో మాత్రం బెల్ట్ షాపు లు విచ్చల విడిగా ఉన్నాయి వాటి దగ్గర మాత్రం లిక్కర్ కు కొరత లేదు అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు సరిపడే యూరియా ను తెప్పియాలని అన్నారు. లేని పక్షం లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ను ముట్టడి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, మండలం సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, గ్రామ సహాయ కార్యదర్శి బొమ్మకంటి అంజయ్య చారి , నాయకులు ఎండీ నాయ్యిమ్, న్యత కొమురయ్య, బూట్ల భాస్కర్, రాపోలు రాయమల్లు , కళ్లెం రవి తదితరులు పాల్గొన్నారు.





