Sunday, March 8, 2026

*మిత్రుడి యాదిలో బడికి సామాగ్రి వితరణ*

*నేటి సాక్షి, ఎండపల్లి:* మండల పరిధి గుల్లకోట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన కీ.శే కాంపెల్లి దిలీప్ జ్ఞాపకార్థం సహచర పదవ తరగతి (2020-21) మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.20 వేల విలువ చేసే పోడియం, గ్రీన్ మ్యాట్‌ను బహూకరించారు. ఈ సామాగ్రి విద్యార్థులకు బోధన కార్యక్రమాల్లో ఎంతో ఉపయోగపడుతుందని, తమ మిత్రుడు దిలీప్ జ్ఞాపకాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మిత్రులు పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు సామాగ్రి బహుకరించడం పట్ల ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కీ.శే కాంపెల్లి దిలీప్ మిత్ర బృందం, పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.రమాదేవి, ఆర్.మాలతి, వి.ప్రశాంత్, ఎన్.నరేష్ కుమార్, కె.కృష్ణారెడ్డి, ఎన్. శ్రీలత, శిరీష, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News