Sunday, March 8, 2026

*పంట ఉత్పత్తుల కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి**జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,, ఫిబ్రవరి 3,

నేటి సాక్షి జిల్లాలో వరి ధాన్యం, పత్తి పంటల కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తో కలిసి జిల్లా పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం, పత్తి పంటల కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పత్తి పంట దిగుబడి అంచనా వేయాలని, తదనగుణంగా కొనుగోలు కొరకు ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనుగోలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 23 వేల ఎకరాలను పత్తి సాగు చేసే అవకాశం ఉందని, పంట దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కొరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, జిల్లాలోని రైస్ మిల్లులకు 1 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందని తెలిపారు. పంట ఉత్పత్తులను రైతుల వద్ద నుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి సకాలంలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోలు కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేంద్రాల ఏర్పాటులో నిబంధనలను పాటించాలని తెలిపారు. పంట విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని, టార్పాలిన్లు, గోనె సంచులు, తేమ, తూకం యంత్రాలు అవసరమైన మేర సమకూర్చాలని, హమాలీల సంఖ్య అనుగుణంగా ఉండేలా పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హత గల రైతులకు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా సహకార అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News