Sunday, March 8, 2026

*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి** జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాలు* నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్*

నేటి సాక్షి – మెట్ పల్లి*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు సకాలంలో గృహాలు అందించాలంటూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెట్‌పల్లి మండలం బండలింగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు.*పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలి*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన అన్ని ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేసి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి లబ్ధిదారునికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.ఇటుక, కంకర, బేస్‌మెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు లబ్ధిదారులకు అనుకూలంగా ఉండేలా అధికారుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెనుకబడి ఉంటే తక్షణమే వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.*గడువులోపు లక్ష్యాలు పూర్తి చేయాలి*లబ్ధిదారులకు కేటాయించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరగాలని, ఇందుకు అవసరమైన మేస్త్రీలు, కార్మికులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.నిర్మాణ సమయంలో ఆర్థిక సమస్యలు ఎదురైతే ఐకేపి సహకార సంఘాల ద్వారా రుణాలు పొందవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు దశలవారీగా నేరుగా ఆధార్ లింక్ చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని కలెక్టర్ వివరించారు.*లబ్ధిదారులతో నేరుగా సంభాషణ*అనంతరం మార్కింగ్, బేస్‌మెంట్, స్లాబ్ లెవల్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి త్వరలోనే గృహప్రవేశం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపిడీవో సురేష్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News