Thursday, March 5, 2026

*మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి** పోలింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ పూర్తి—*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు సమక్షంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల విధానం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సాగాలనే ఉద్దేశంతో ఈ రాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.*పకడ్బందీ ఏర్పాట్లు – అధికారుల సమన్వయం*రాబోయే మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, పోలింగ్ సిబ్బంది కేటాయింపులో నిష్పక్షపాతత్వాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి కె. రాము, కలెక్టరేట్ ఏవో హకిమ్, ఈడిఏం మమతతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.——-

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News