Sunday, March 8, 2026

ప్రజ్ఞాపూర్‌లో నూతన బస్టాండ్ ప్రారంభంస్టార్ హెల్త్–లయన్స్ క్లబ్‌ల సేవా కార్యక్రమానికి ప్రశంసలునేటి

సాక్షి గజ్వేల్ ఫిబ్రవరి 4: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జగదేవపూర్ వెళ్లే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రులు ‘బావాస్ బ్యాచ్’ సౌజన్యంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి పర్యవేక్షణలో పునర్నిర్మించిన బస్టాండ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మూడు రాష్ట్రాల బిజినెస్ హెడ్ కె. బాల బాలాజీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరిలో సేవా భావం పెంపొందాలని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ పునర్నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు.లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ “మానవసేవే మాధవసేవ” అనే నినాదంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా రాధాకృష్ణ వారి మిత్రులు, స్టార్ హెల్త్ సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభ సూచికమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య, లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, రామ్ పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్, సంతోష్, నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి సభ్యులు డాక్టర్ శైలజ, సుజాత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News