Saturday, March 7, 2026

*కోరుట్ల-మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో..**‘రెబల్’ రాజకీయ భూకంపం.!*———————————* ధనబలానికి వ్యతిరేకంగా కార్యకర్తల ‘యుద్ధం’.?* టికెట్ నిరాకరణతో రగిలిన ఆత్మగౌరవ రాజకీయ పోరాటం—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన మోసుకుంటూ, ఎండనకా వాననకా ప్రజల మధ్యే జీవితం గడిపిన నాయకుడికి టికెట్ నిరాకరించడమంటే… అది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం కాదు. ఆ నాయకుడి వెనుక నడిచిన వందలాది కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకిన రాజకీయ గాయం. అందుకే కోరుట్ల – మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో మొదలైన ఈ ‘రెబల్’ విస్ఫోటనం, సాధారణ అసంతృప్తిగా కాకుండా ఒక యుద్ధంలా రూపాంతరం చెందుతోంది.—*టికెట్ రాజకీయాలు… రగిలిన కార్యకర్తల మనసులు*పార్టీలకు అసలు బలం కిందిస్థాయి కార్యకర్తలే. కానీ అదే కార్యకర్తలను విస్మరించి, దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన నాయకత్వాన్ని పక్కన పెట్టి, కేవలం ధనబలం, ‘విన్-ఎబిలిటీ’ పేరుతో టికెట్లు కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ అసహనమే ఇప్పుడు రెబల్ రాజకీయంగా బయటపడుతోంది. ఇది ఒకరి వ్యక్తిగత తిరుగుబాటు కాదు… కార్యకర్తల సమూహ ఆవేదనకు ప్రతిరూపం.*స్థానిక ఎన్నికల్లో ఓటు విలువ ఎంత కీలకం..?*స్థానిక సంస్థల ఎన్నికలు గానీ, మున్సిపల్ ఎన్నికలు గానీ.. ఇక్కడ భారీ మెజార్టీలు చాలా అరుదు. ఎవరు గెలిచినా సాధారణంగా 50 నుంచి 100 ఓట్ల తేడాతోనే విజయం సాధిస్తారు. ఒక వార్డులో సగటున 1,500 ఓట్లు ఉన్నాయనుకుంటే, రెబల్ అభ్యర్థి చీల్చే 150 నుంచి 200 ఓట్లు… అధికారిక అభ్యర్థి గెలుపు–ఓటముల మధ్య గీతను చెరిపేసే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి.*రెబల్ ప్రభావం… ఫీల్డ్ లెవల్‌లోనే స్పష్టత*పార్టీకి వెన్నెముకలుగా ఉన్న కార్యకర్తలు రెబల్ వైపు మొగ్గు చూపితే, అధికారిక అభ్యర్థికి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం కత్తిమీద సామే అవుతుంది. సభలు, ర్యాలీలు, ప్రచార ఆర్భాటం కనిపించినా… ఇంటింటి ప్రచారం, పోలింగ్ రోజు ఓటర్లను తీసుకొచ్చే వ్యవస్థ కుదరదు. ఫలితంగా పార్టీ అభ్యర్థి ఒంటరిగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది.*డబ్బుతో టికెట్… ప్రజలతో బంధం సాధ్యమా..?*డబ్బుతో టికెట్ సాధించవచ్చు. ప్రచారానికి వాహనాలు పెట్టవచ్చు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో ఊరంతా నింపవచ్చు. కానీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం అంత సులభం కాదు. ‘ప్రచార ఆర్భాటం’ ఓటర్లను క్షణికంగా ఆకర్షించవచ్చు గానీ… కష్టసుఖాల్లో తోడుండే స్థానిక నాయకత్వంపైనే ప్రజలు చివరికి నమ్మకం ఉంచుతారు. ఈ వాస్తవం కోరుట్ల – మెట్‌పల్లిలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.*కార్యకర్తల విస్మరణ… పార్టీ భవిష్యత్తుకు ముప్పేనా..?*కిందిస్థాయి కార్యకర్తలను విస్మరించి, కేవలం గెలిచే సామర్థ్యం ఉందనే కారణంతో ధనవంతులకు పెద్దపీట వేస్తే… భవిష్యత్తులో పార్టీ నిర్మాణమే కూలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు రెబల్ అభ్యర్థిగా బయటపడిన అసంతృప్తి, రేపు పెద్ద స్థాయి విభజనలకు దారి తీస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.*కోరుట్ల – మెట్‌పల్లి.. ఇతర నియోజకవర్గాలకు హెచ్చరిక.!*కోరుట్ల – మెట్‌పల్లిలో ఏర్పడిన ఈ రాజకీయ పరిస్థితి, ఇతర మున్సిపాలిటీలకు ఒక పాఠంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 ఓట్లలోపు తేడా ఉండే చోట, రెబల్ అభ్యర్థి ‘కింగ్ మేకర్’ కాకపోయినా… కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ అవుతాడన్నది నిర్ధారిత రాజకీయ సత్యం.*చివరగా ‘ఒక్క మాట’.!*ఈ ‘రెబల్ రాజకీయ భూకంపం’ ఎవరి విజయానికో, ఓటమికో మాత్రమే పరిమితం కాదు. ఇది పార్టీలు కార్యకర్తలను ఎలా గౌరవించాలి, స్థానిక నాయకత్వానికి ఎంత విలువ ఇవ్వాలి అన్న ప్రశ్నను మరోసారి రాజకీయ అజెండాగా మారుస్తోంది. కోరుట్ల – మెట్‌పల్లిలో మొదలైన ఈ యుద్ధం, రేపటి రాజకీయ దిశను మార్చే సూచనలివ్వడం ఖాయం._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News