Saturday, March 7, 2026

భారతీయ రిజర్వ్ బ్యాంక్ సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంతెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ అంజయ్య

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ అంజయ్య అధ్యక్షతన చిలువకోడూర్ మరియు లక్షింపూర్ గ్రామాలలో గ్రామపంచాయతీ ఆవరణలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించినారు ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా సర్పంచులు మరియు వార్డ్ మెంబర్లు పాల్గొని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ చుంచు నరేష్ ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీ యొక్క లావాదేవీ వివరాలు అడిగినట్లయితే మేము నేరుగా బ్యాంకుకు వెళ్లి సంబంధిత అధికారులతో మేము మాట్లాడుతామని తెలియజేయండి డిజిటల్ లావాదేవీలు చెల్లింపు జరుగుతున్నప్పుడు సైబర్ నేరాల సెక్యూరిటీ గురించి ఖాతాదాలకు అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో తన తదనంతరం కుటుంబం అంతే సంతోషంగా బాగుండాలని ఇన్సూరెన్స్ గురించి ప్రధానమంత్రి జీవనజ్యోతి సురక్ష బీమా ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ వీటి గురించి ఖాతాదారులకు వివరించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది లక్ష్మణ్ మహిళ సంఘాల సభ్యులు రైతులు యువకులు బ్యాంక్ వి ఓ ఏ లు కాజా మియా పూజిత ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News