Saturday, March 7, 2026

*గన్నేరువరం సీనియర్ జర్నలిస్టు అకాల మరణం*

*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన విభూతి వీరకుమార్ వయస్సు (53) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో అకాల మరణం చెందాడు.. ఉమ్మడి బెజ్జంకి మండలం మరియు గన్నేరువరం మండలానికి జర్నలిస్టుగా విధులు నిర్వహించాడు. ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, వివిధ పత్రికలలో పనిచేసి మంచి గుర్తింపు పొందాడు.. గ్రామంలో రేషన్ డీలర్ గా సేవలందించాడు.. నిరంతరం మండలంలోని ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తన వంతుగా మండల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.. భార్య,ఇద్దురు కుమారులు ఉన్నారు..విరకుమార్ ఆత్మకు శాంతి కలగాలని చీమలకుంటపల్లి గ్రామ సర్పంచ్ జంగిటి ప్రకాష్, గన్నేరువరం టియుడబ్ల్యూజె (ఐజేయు) మండల అధ్యక్షుడు మాదరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు,మండల మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తెల్ల రవీందర్, సభ్యలు బూట్ల శ్రీనివాస్,బుర్ర అంజయ్య గౌడ్ బుర్ర కోటేశ్వర్ గౌడ్, తుమ్మ సతీష్,ఇనుకొండ లక్ష్మణ్, డీలర్ల సంఘం మండల అధ్యక్షులు బోడ ప్రతాప్ రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి చోక్కల శ్రీశైలం, కుసుంబా అంజయ్య, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News