Saturday, March 7, 2026

*ఆలయంలో దొంగతనం కేసులో ‘భార్యాభర్తల అరెస్టు’.!** కోదండ రామాలయంలో దొంగతనం కేసు ఛేదన* బంగారు–వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం* ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు తప్పవు : డీఎస్పీ రఘు చందర్—*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.*ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం*పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి కోదండ రామాలయంలో తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డ దుండగులు, దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును దొంగిలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.*భార్యాభర్తల అరెస్టు*దర్యాప్తులో భాగంగా జగిత్యాల రూరల్ మండలం తాటిపెళ్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు, వడ్లూరి రజితలే ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.*నిందితుల వద్ద నుండి స్వాధీనం*నిందితుల వద్ద నుండి రూ.4,357 నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను కేసు దర్యాప్తులో భాగంగా నమోదు చేసినట్లు తెలిపారు.*ప్రజల భద్రతకే ప్రాధాన్యం*ప్రజల ఆస్తుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.——

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News