నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 6( మెట్టు రుద్రరాజు)కేంద్ర ప్రభుత్వం బీజేపీ మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకం పేరు మార్చాలని చేస్తున్న కుట్రపూరితమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పాలేరు నియోజకవర్గ జేఏసీ సంఘాల నాయకులు మందడి ఇజ్రాయిల్ అన్నారు. తిరుమలయపాలెం మండలకేంద్రంలో శుక్రవారం మండల అధికారి పీడీపీ శ్రీదేవీ ను మందడి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో జేఏసీ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పేరులో ఎటువంటి మార్పులు చెయ్యకుండా యధావిధిగా పేరు కొనసాగేవిధంగా చూడాలని వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం లో ఫీల్డ్ ఆఫీసర్లు గా విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చెయ్యాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించి మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకం పేరు మార్చాలని చూస్తే ఏటువంటి ఉద్యమం చేయడానికైనా జేఏసీ సంఘాలు సిద్దంగా ఉన్నాయని వెనకదే ప్రసక్తేలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు షేక్ మియా పంది అంజయ్య షేక్ సలీహా బేగం అల్లి గీత ఎస్ కె శిలార్,లంజపల్లి వీరస్వామి, పోలేపొంగు నాగేశ్వరరావు నేతగాని ప్రభాకర్,ఎస్.కె పాషా,గుగులోత్ పాప,తదితరులు పాల్గొన్నారు.





