మరిపెడలో మాజీ మంత్రి రెడ్యా నాయక్ అగ్నిపర్వంటికెట్ కోసం ₹30 లక్షలు డిమాండ్.. ₹10 లక్షలు వసూలు చేసి దాడి..? ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్ పై సంచలన ఆరోపణలుప్రజల రక్షకుడే ప్రజలపై కత్తి ఎత్తితే ఇదేనా పాలన..? ప్రజాస్వామ్యంపై ప్రశ్నార్థకంపక్కటేముకలు విరగ్గొట్టే వరకు కొట్టించిన ఎమ్మెల్యే..! గిరిజన సమాజాన్ని కుదిపేసిన ఘటనక్షమాపణ చెప్పకపోతే నీ బండారం బయటపడుతుంది – ఎమ్మెల్యేకు రెడ్యా నాయక్ సూటి హెచ్చరికనేటి సాక్షి మహబూబాబా ద్ ఫిబ్రవరి 7 మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండల కేంద్రం రాజకీయంగా ఉత్కంఠకు కేంద్రబిందువుగా మారింది.స్థానిక మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రెడ్యా నాయక్, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్పై తీవ్ర స్థాయి సంచలన ఆరోపణలు గుప్పించారు.గిరిజన ఎమ్మెల్యే అయి ఉండి, సాటి గిరిజన వ్యక్తిపై దాడికి పాల్పడటం చరిత్రలోనే నల్ల అధ్యాయమని, ఇది కేవలం ఒక వ్యక్తిపై కాదు – మొత్తం గిరిజన సమాజంపై జరిగిన దాడిగా రెడ్యా నాయక్ పేర్కొన్నారు.ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి➡️ ₹30 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం,➡️ అందులో ₹10 లక్షలు తీసుకోవడం,➡️ చివరకు టికెట్ ఇవ్వకుండా ప్రశ్నించిన గిరిజన వ్యక్తిపై దాడి చేయడంఅత్యంత నీచమైన, అమానుషమైన చర్యగా అభివర్ణించారు.దాడి సమయంలో బాధితుడిని పక్కటేముకలు విరగ్గొట్టే వరకు కొట్టారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు.ఓట్లు వేసి గెలిపించిన ప్రజలనే కొట్టే స్థాయికి ఎమ్మెల్యే బలుపు, మదం, అహంకారం ఎక్కిందని మండిపడ్డారు.నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు, రక్షణ చూసుకోవాల్సిన ఎమ్మెల్యే,ప్రజలపై దాడులు చేయడం, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడటంప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టేనని రెడ్యా నాయక్ ఆరోపించారు.ఈ ఘటనలో బాధితుడు గిరిజనుడే కావడం మరింత బాధాకరమని,గిరిజన ఎమ్మెల్యే చేతిలో గిరిజనుడే గాయపడటంగిరిజన సమాజానికి అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్👉 వెంటనే గిరిజన సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని,👉 బాధితుడికి న్యాయం చేయాలని,👉 దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో,ఎమ్మెల్యే వ్యవహారాలన్నింటినీ –టికెట్ల వ్యాపారం, డబ్బుల వసూళ్లు, బెదిరింపులు, దాడుల వెనుక ఉన్న నిజాలనుప్రజల ముందు పెట్టి బండారాన్ని బయటపెడతామని రెడ్యా నాయక్ సూటిగా హెచ్చరించారు.ఈ ఘటనపై తక్షణమేస్వతంత్ర విచారణ జరపాలని,బాధితుడికి పూర్తి భద్రత కల్పించాలని,గిరిజన సమాజానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.





