Saturday, March 7, 2026

*బీజేపీ–బీఆర్ఎస్‌కు ఓటు అంటే చెత్తబుట్టలో వేసినట్లే!** కోరుట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం* అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ తప్పదు—–*నేటి సాక్షి

కోరుట్ల*( రాధారపు నర్సయ్య )బీజేపీ లేదా బీఆర్ఎస్‌కు ఓటు వేయడం అంటే ఆ ఓటును చెత్తబుట్టలో వేసినట్టేనని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్న ఆయన, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.*చేతి గుర్తుతోనే అభివృద్ధి సాధ్యం*ప్రజలతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనం ఏ పని చేయాలన్నా చేతితోనే చేస్తామని, అందుకే ప్రజల అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి తమ చేతులతో కాంగ్రెస్ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోరుట్లలో జువ్వాడి నర్సింగ్ రావు పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.*కాంగ్రెస్ గెలిస్తే కోరుట్లకు భారీ నిధులు*కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కోరుట్ల అభివృద్ధికి అత్యధిక నిధులు ఇప్పించే బాధ్యత తనదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గానికి రూ.18 కోట్లు 70 లక్షల నిధులు మంజూరయ్యాయని, వాటితో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపనలు చేపట్టినట్లు వెల్లడించారు.*సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వం*కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డుల మంజూరు, దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.*33 జిల్లాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది*తెలంగాణలోని 33 జిల్లాల్లో 120 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో కోరుట్ల నియోజకవర్గంలో చేసింది శూన్యమేనని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు మూడు కోట్ల 17 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు.*బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యం*అనంతరం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు ద్వారా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.*రత్నాకర్ రావు బాటలోనే కోరుట్ల అభివృద్ధి*కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ, కోరుట్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి ఫలితమేనన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. వెటర్నరీ కాలేజ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల, ఫిల్టర్ బెడ్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి స్వర్గీయ రత్నాకర్ రావు విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.*ఇందిరమ్మ ఇండ్ల ఘనత కాంగ్రెస్‌కే*కోరుట్ల పట్టణంలో అత్యధికంగా 4,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావుకే దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 70 ఇండ్లు మాత్రమే నిర్మించిందని, అందులోనూ కొన్నింటిని అమ్ముకున్నారనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 600 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశామని, ఎన్నికల అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు, రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.*బీఆర్ఎస్ పాలనలో ప్రజాధన దుర్వినియోగం*కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, ఎకిన్‌పూర్ బ్రిడ్జి వంటి నిర్మాణాల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చివరకు అవి కూలిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కోరుట్ల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, కేవలం కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీసిందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, మండల అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News