Saturday, March 7, 2026

*పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి**జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,,ఫిబ్రవరి 8,

నేటి సాక్షి2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించబడిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలని తెలిపారు. ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మించి ఓటు వేయడం జరుగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, పోలింగ్ ముగిసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలపై శిక్షణలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ అధికారులకు కేంద్రాలలో త్రాగునీరు, మూత్రశాలలు, లైటింగ్, ఫ్యాన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజున ఓటింగ్ సంబంధిత ప్రతి నమూనాను పూర్తిగా నింపాలని, పోలింగ్ నిర్వహణ ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. 11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, 12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News