నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………..జగిత్యాల జిల్లా కేంద్రంలోని పి ఆర్ టి యు టి ఎస్ కార్యాలయంలో ఘనంగా 55 వ పి ఆర్ టి యు టి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సామల యాదగిరి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు,యాల్ల అమర్నాథ్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యావ్యవస్థ బలోపేతం కోసం పి ఆర్ టి యు కృషిచేసిందని, అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎన్నో జీవోలు సాధించిన ఘనత పి ఆర్ టి యు దని వారు అన్నారు. ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు రూల్స్ గాని 010 జీతాలు గాని అప్రెంటిషిప్ రద్దు గాని అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులకు స్పెషల్ క్యాజువల్స్ మెటర్నిటీ లీవ్స్ మరియు చైల్డ్ కేర్ లీవ్స్ ఇప్పించిన ఘనత పి ఆర్ టి యు దే అని వారన్నారు.సంఘానికి విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు చింతపండు నర్సింగం, మానేరు శంకరయ్య, జనార్దన్ ల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు అబ్దుల్ జమీల్ రాష్ట్ర జిల్లా మండల శాఖ బాధ్యులు పాల్గొన్నారు.





