Saturday, March 7, 2026

*ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం*

నేటి సాక్షి, ధర్మారం (ఫిబ్రవరి 9) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఆరవ తరగతి ప్రవేశం, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల కొరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవాలని సోమవారం ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. 2026-27 అకడమిక్ సంవత్సరానికి గాను ధర్మారం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి, ఏడు నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన మండల విద్యార్థిని విద్యార్థులు సంబంధిత తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక tgms.telngana.gov.in వెబ్ సైట్ లో ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవాలని అన్నారు. అప్లయ్ చేసుకున్నవారికి ఏప్రిల్ 19 ఆదివారం రోజున ఉదయం 6వ తరగతి కొరకు మధ్యాహ్నం 7నుండి 10 వ తరగతి లో ప్రవేశం కొరకు పరీక్ష స్థానిక ధర్మారం ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. అప్లై చేసుకునే విద్యార్థులు వారి తల్లి తండ్రులకు మరింత సమాచారం, సందేహాలను నివృత్తి చేసుకొనుటకు ఆదర్శ పాఠశాల లో సంప్రదించవచ్చని ధర్మారం మండల అర్హత గల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News