నేటి సాక్షి, నల్లబెల్లి ఫిబ్రవరి 09 :మేడపల్లి గ్రామంలోని ఊర చెరువు సమీపంలో ఉన్న లక్ష్మీ దేవమ్మ (సత్తియాడి) ఆలయానికి విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అధికారులు వెంటనే స్పందించారు.కరెంట్ ఎ డి , D.E స్వయంగా ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.ఆలయానికి విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు.దీంతో భక్తులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నాళ్లుగానో ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగు పడిందని తెలిపారు.ప్రభుత్వ అధికారుల స్పందన అభినందనీయమని గ్రామ పెద్దలు ప్రశంసించారు.





