నేటి సాక్షి 16 ఫిబ్రవరి జూపాడుబంగ్లా:-జూపాడుబంగ్లా మండలంలోని, తుడిచెర్ల గ్రామంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆహ్వానం మేరకు శ్రీ భ్రమరాంబ సమేత శంకర మల్లేశ్వరస్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, పాములపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, తదితర నాయకులకు ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది.శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత శ్రీ శంకర మల్లేశ్వర స్వామి తిరుణాలను పురస్కరించుకొని తూడిచర్ల గ్రామ పెద్దలు, మరియు ఆలయ కమిటీ సభ్యులు కలిసి డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు కు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది . ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు, ప్రజలకు ఆలయ కమిటీ వారికి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, పాములపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి-జి.హరి ప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, తదితర నాయకులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత శ్రీ శంకర్ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నిండుగా ఉండాలని శంకర మల్లేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.





