Friday, March 6, 2026

*జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ గా సమిండ్ల వాణి**వైస్ చైర్మన్ గా జీనథ్ పర్వీన్*——————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………..జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ గా 43 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ గా సమీండ్ల వాణీ (కాంగ్రెస్) కొండా అరుణ( బీజేపీ) లు పోటీపడగా సమీండ్ల వాణీ కి 39 మంది కౌన్సిలర్ లు మద్దతు తెలపడం, కొండా అరుణకు 5 గురు బీజేపీ కౌన్సిలర్ లు మద్దతు తెలిపారు. దీంతో సమీండ్ల వాణీ నీ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా అధికారులు ప్రకటించారు.అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణి కే జగిత్యాల బల్దియా పీఠం దక్కగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన జీనథ్పర్వీన్ ను వైస్ చైర్మన్ పదవి వరించింది.గత రెండు రోజులుగా ఇరు వర్గాలు హైదరాబాద్ లో వేరు వేరుగా కౌన్సిలర్లతో క్యాంపులు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే వైపే మొగ్గుచుపింది.కాంగ్రెస్ పార్టీ తరపున చైర్ పర్సన్ బి ఫామ్ ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు గాజేంగి నందయ్య మున్సిపల్ అధికారులకు అప్పజెప్పగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి కౌన్సిలర్లు వాణికి మద్దతు తెలిపారు.ఆదివారం ఉత్కంఠ గా సాగిన హైడ్రామా కు తెర సోమవారం తెరపడినట్లయింది.అయితే కాంగ్రెస్ పార్టీనుండి మొదటి నుండి ఛైర్పర్సన్ పదవి ఆశిస్తూ వచ్చిన మాజీ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి ఏ పార్టీకి మద్దతు తెలుపకపోవడం విశేషం.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చైర్ పర్సన్ ఎన్నిక జరిగిందనీ, ఆమెకు39 మంది మద్దతు ఉన్న తర్వత నేను మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, నేను వేరేవారికి కూడా మద్దతు తెలపలేదని ఛైర్పర్సన్ ఎన్నిక అనంతరం అడువాల జ్యోతి లక్ష్మణ్ చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News