నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి,19,,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ధన్వాడ లో గురువారం నాడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫేర్వెల్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కుమారి హర్షిత జీ మెయిన్స్ 2026 పరీక్షలో 73 పర్సంటైల్ సాధించి జీ అడ్వాన్స్ కు అర్హత సాధించింది. బైపిసి ద్వితీయ సంవత్సరం విద్యార్థి శైలజ జాతీయస్థాయి పథకాన్ని అలాగే రాష్ట్రస్థాయిలో జరిగిన కోకోలో పథకాన్ని సాధించి ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ధన్వాడకు, అలాగే ధన్వాడ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చినటువంటి విద్యార్థులకు కళాశాల ప్రధానాచార్యులు మహమ్మద్ అబ్దుల్ ముజీద్ వారికి ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా సన్మానించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదవాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ప్రతిరోజు పూజించాలన్నారు. కళాశాల విద్యార్థులు చక్కగా చదివి ధన్వాడ మండలానికి నారంపేట జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. జీవితంమంతా కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపకులు మేరీ, ఆంజనేయులు,సాంబశివుడు, నివాస్,నరసయ్య, శివకుమార్, హనుమంతు, అత్తార్ హుస్సేన్, రామకృష్ణ, మరియు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





